టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఎంత జాగ్రత్తగా ఉంటారో చేయపాల్సిన పనిలేదు. ముఖ్యంగా డబ్బుల విషయంలో మరీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క రూపాయిని కూడ ఊరికే వదలరు. అలాంటి వ్యక్తినే ఒకడు బురిడీ కొట్టించడు. అతడే నాగార్జున. ఇతగాడు ఒక చీటర్. మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేయడం ఇతగాడి పని. ఇప్పుడిప్పుడే సినిమాల షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో అన్ని నిర్మాణ సంస్థలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయించే పని పెట్టుకున్నాయి. సురేష్ బాబు కూడ తన ఆఫీస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే ప్రయత్నాల్లో ఉండగా నాగార్జున ఈ మోసానికి పాల్పడ్డాడు.
సురేష్ బాబు కార్యాలయానికి ఫోన్ చేసి తన వద్ద వ్యాక్సిన్స్ ఉన్నాయని నమ్మబలికాడు. అతని మాటలు నిజమే అనుకున్న సురేష్ బాబు మేనేజర్ 500 వ్యాక్సిన్లకుగాను లక్ష రూపాయలను అతగాడి బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. డబ్బు అందుకున్న వెంటనే నాగార్జున ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట. దీంతో మోసం జరిగిందని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇక సురేష్ బాబు లాంటి బిగ్ షాట్ కంప్లైంట్ చేస్తే పోలీసులు ఊరుకోరు కదా. తక్షణమే రంగంలోకి దిగి నాగార్జునను వెతికి పట్టి కటకటాల వెనక్కి నెట్టారు. సదరు నాగార్జున ఒక్క సురేష్ బాబునే కాదు ఇంకొందరిని కూడ ఇదే మాయ మాటలు చెప్పి మోసం చేయడం జరిగిందట.