Nagarjuna : ఆ దమ్మున్న నాగార్జున ఎటు పోయాడు? దుమారం రేపుతున్న పాత వీడియో.!

Nagarjuna :  టాలీవుడ్ లో కొన్ని తారలు ఉన్నాయి ఒక్కో తరంలో పిల్లర్స్ లా పలువురు స్టార్ హీరోలు నిలిచారు. అలా ఒక 80 లు 90 లు 2000 మొదటి నాటికి అలా కొంతమంది అగ్ర హీరోలు టాప్ 4 ప్లేస్ లలో నిలిచి కొనసాగారు. మరి తర్వాత యంగ్ హీరోలతో కాంపిటేట్ చేస్తూనే తమకి తగ్గ సినిమాలు చేస్తూ వచ్చారు.

మరి ఈ హీరోల్లో టాలీవుడ్ మన్మధుడు కిన్ నాగార్జున కూడా ఒకరు. అయితే నిన్న తన లేటెస్ట్ సినిమా “బంగార్రాజు” సినిమా కి సంబంధించి ఒక కీలక మీటింగ్ జరగగా అందులో తాను చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి.

సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడ్డం కరెక్ట్ కాదని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ వర్గానికి ఇంకో వర్గానికి మధ్య హీట్ ని పుట్టించాయి. అయితే ఓ రకంగా నాగ్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడినా తాను మాత్రం నిన్న చేసిన స్టేట్మెంట్స్ కి బుక్కయ్యిపోయాడు.

తన కెరీర్ లో మాస్ సినిమా అయినటువంటి “రగడ” సినిమా ఆడియో ఫంక్షన్ కి చెందిన ఒక వీడియో ఇప్పుడు నిన్న నాగ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కి కౌంటర్ గా వైరల్ అవుతుంది. ఆ టైం లో నాగార్జున ఎంతో దమ్ముతో తన సినిమా స్టేజ్ పై నిలబడి అప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తాడు.

ఇప్పుడు ఇదే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అప్పుడు అంతలా మాట్లాడిన నాగార్జున ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని.? అప్పుడు ఉన్న దమ్ము ఇప్పుడు ఎటు పోయింది అని నెటిజన్ల ప్రశ్న. దీనితో నాగ్ మాత్రం ఇప్పుడు బాగానే బుక్కయ్యిపోయాడు. మరి దీనిపై నాగ్ ఏమన్నా స్పందన ఇస్తాడో లేదో అనేది మరింత ఆసక్తిగా మారింది.

https://twitter.com/TwoodTrolls/status/1478946330005278720?t=EVQDYAtnJFQiI6tJewlGjA&s=19