Nagarjuna: నాగార్జున,అఖిల్ కాంబినేషన్ లో సినిమా.. ఎప్పుడో తెలుసా?

Nagarjuna: టాలీవుడ్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం నాగార్జున ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నాగార్జున తన కొడుకు నాగ చైతన్య తో కలసి మనం, బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య తో కలిసి నాగార్జున ఫుల్ లెంత్ రోల్ చేశారు.

ఇదిలా ఉంటే నాగార్జున తన మరో తనయుడు అయిన అఖిల్ కూడా ఛాన్స్ ఇచ్చారు అన్న వార్త సిని వర్గాల్లో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. నాగార్జున, అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని, ఈ సినిమాకు సంగీత దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ లు కలిసి నటించిన బ్రో డాడీ సినిమాకు రీమేక్ గా వస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.