Nagarjuna: వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకున్న అక్కినేని నాగార్జున..?

Nagarjuna: టిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టాలీవుడ్ లో పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. కోట్లాది మొక్కలను నటించడమే లక్ష్యంగా పెట్టుకుని, తెలంగాణాని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా జోగినిపల్లి సంతోష్ కుమార్ బిగ్ బాస్ స్టేజ్ పై దర్శనమిచ్చారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్ బాస్ షో వేదికగా చాటి చెప్పారు. తాజాగా జరిగిన ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో కి వచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభం అయ్యి 3 సంవత్సరాలు పూర్తి అయ్యిందని తెలిపారు. అలాగే ఒక మొక్కను తీసుకువచ్చి బిగ్ బాస్ హౌస్ లో నాటమని నాగార్జునకు ఒక మొక్కను బహుకరించారు.

ఎంపీ సంతోష్ కుమార్ గడిచిన మూడేళ్లలో దాదాపుగా 16 కోట్ల మొక్కలు నాటాలని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్తత తీసుకున్నారని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సందర్భంగా హీరో ప్రభాస్ 1650 ఎకరాలు దత్తత తీసుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అడవి ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు రావడం విశేషం. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి నాగార్జున సిద్ధమైనట్టు తెలుస్తోంది.అలాగే ప్రతి ఒక్కరు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాది మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చాడు.