Nagababu: నాగబాబుకు ఎమ్మెల్సీ వారసత్వం కాదు… జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!

Nagababu: ఇటీవల ఏర్పడిన 5 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడం కోసం కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ఖరారు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా నాగబాబు పేరును ప్రకటించడమే కాకుండా శుక్రవారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఇలా జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఎంపిక చేయడంతో వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కుటుంబ వారసత్వానికి వీలు లేదు అంటూ మాట్లాడారు మరి అలాంటప్పుడు జనసేన కోసం ఎంతోమంది కష్టపడుతున్న నాగబాబుకి ఎందుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు అంటూ విమర్శల కురిపించారు. ఇది కచ్చితంగా కుటుంబ వారసత్వమే అంటూ విమర్శలు చేశారు.

ఇలా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం గురించి వైసిపి నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తే అది కుటుంబ వారసత్వం అవుతుంది. నాగబాబుకు ఇస్తే వారసత్వం ఎలా అవుతుంది అంటూ ఈయన ప్రశ్నించారు.

నాగబాబు జనసేన పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారు. పొత్తులో భాగంగా నాగబాబు చివరికి ఎంపీ టికెట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చిందని బొల్లి శెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఇలా ఎంపీ సీటును త్యాగం చేయడమే కాకుండా కూటమి పార్టీల విజయం కోసం నాగబాబు ఎంతో కష్టపడ్డారు ఇలా పార్టీ కోసం కష్టపడే వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం సరైన నిర్ణయమని ఇది కుటుంబ వారసత్వం అసలు కాదు అంటూ ఈయన అంబంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.