Nagababu: ఏడాది క్రితం అనుకున్నదే ఇప్పుడు నిజమైంది…. పవన్ కళ్యాణ్ పై నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Nagababu: జనసేన అధినేత ఎమ్మెల్సీ నాగబాబు ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇలా రాజకీయాల పరంగా జనసేన పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి సంబంధించిన పోస్టులు చేయటం చేస్తుంటారు అయితే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ…సేనాని.. సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది, మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైంది, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైంది, అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైంది అంటూ నాగబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక ఏడాది క్రితం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులలో కూడా ఓట్లు చీలనివ్వనంటూ తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని మరి వైసీపీని మట్టి కరిపించారు. ఇక పొత్తులో భాగంగా తొలుత 24 సీట్లు తీసుకున్న పవన్, ఆ తర్వాత కూటమిలో బీజేపీ చేరిన తర్వాత మూడు సీట్లు తగ్గించుకుని 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై వైసీపీ రెచ్చగొట్టే పోస్టులు చేసి పొత్తు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అది జరగలేదు. ఇలా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి 100% విజయం సాధించడమే కాకుండా తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసి తనని తాను నిరూపించుకున్నారనే చెప్పాలి.