Nagababu: ఆ విషయంలో మనసు మార్చుకున్న నాగబాబు….. పవన్ ఢిల్లీ పయనం అందుకేనా?

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కిన విషయం మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని భావించారు కానీ కొన్ని కారణాలవల్ల ఆ సీటు వదులుకోవలసి వచ్చింది. ఇలా జనసేన పార్టీ కోసం కూటమి పార్టీ విజయం కోసం నాగబాబు ఎంతగానో కష్టపడ్డారు. ఇక కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు ఉన్నత పదవి కల్పించాలని పవన్ కళ్యాణ్ భావించారు.

ఈ క్రమంలోనే ఈయనకు ఏపీ క్యాబినెట్లో చోటు ఇవ్వబోతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ఈయన ఎన్నికలలో పోటీ చేయలేదు కనుక ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తరువాత మంత్రిగా తీసుకోవాలి. ఇలా ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అంటే మార్చి వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో కంటే ఆయనకు పెద్దల సభలోకి వెళ్లాలని ఆశగా ఉందని పలు సందర్భాలలో స్పష్టమైంది.

ముందుగా నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో కాకుండా పెద్దల సభలోనే చోటు ఇవ్వాలని భావించారు. అయితే ఆ మూడు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపికి వెళ్లిపోయాయి. దీంతో నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకువచ్చారు. అయితే తాజాగా నాగబాబు తన మనసు మార్చుకున్నారని తెలుస్తుంది తిరిగి పెద్దల సభలో ఒక సీటు ఖాళీ కావడంతో ఆ సీటు పై నాగబాబు కన్ను పడిందని ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ స్థానంలో కచ్చితంగా కూటమి నేతలు భర్తీ అవుతారు. ఇదివరకు మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీ బిజెపి కైవసం చేసుకున్నారు ఇక ఈ మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేన తరపున తనకు ఇప్పించాలని విధంగా నాగబాబు పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా వెంటనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఇక ఈ స్థానంలో బిజెపి పార్టీకి చెందినటువంటి నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనలు బిజెపి నాయకులు ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్నయ్యకు ప్రాధాన్యత కల్పించాలని కోరినట్టు తెలుస్తుంది. మరి పెద్దల సభకు వెళ్లాలని నాగబాబు కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.