Nagababu: మహేష్ బాబుకు సమానమైన హీరో అతనొక్కడే…. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Nagababu: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు రాకుండా రాజమౌళి ఎంతో పకడ్బంధిగా ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా తాజాగా నటుడు మహేష్ బాబు గురించి మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజీ ఫాలోయింగ్ మరెవరికి లేదని తెలిపారు. మహేష్ బాబుకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు.

హ్యాండ్సమ్ విషయంలో తనకు తిరుగులేదని, అతన్ని ఇష్టపడని మహిళలంటూ ఎవరూ ఉండరన్నారు. కుటుంబ సమేతంగా తన సినిమాలను అందరు చూస్తారని తెలిపారు తన భార్య కూడా మహేష్ బాబుని ఒక తమ్ముడిలాగే భావిస్తుందని నాగబాబు వెల్లడించారు. ఒక నటుడిగా మహేష్ బాబుకు అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయని, వంద అడ్వాంటేజ్ లు ఉన్నాయన్నారు. ఇక వ్యాపార రంగంలో కూడా ఈయన ఎంతో మంచి సక్సెస్ సాధించారని నాగబాబు కొనియాడారు.

ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు సమానమైనటువంటి హీరో ఒకరే ఒకరు ఉన్నారు ఆయనే పవన్ కళ్యాణ్ అని నాగబాబు తెలిపారు. మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్ కి కూడా దక్షిణాదిలో అదే క్రేజ్ ఉందని మహేష్ బాబు, పవన్ కల్యాణ్ క్రేజ్ ఇద్దరిదీ ఒకటే అన్నారు. ఇలా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.