Nagababu: చాలా సంతోషకరమైన సమయం ఇది… సంచలనంగా ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్!

Nagababu: మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఇది చాలా సంతోషకరమైన సమయం అంటూ సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రకటనలో భాగంగా తన కుమార్తె నిహారిక నిర్మాతగా మారి నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమాకు రెండు గద్దర్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగబాబు ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిహారిక నిర్మాతగా మారి నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమాకు గద్దర్ అవార్డులు రావటం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా కూడా అవార్డును కైవసం చేసుకుంది.గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు ప్రఖ్యాత ప్రజా కవి శ్రీ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..

నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు “జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు” లభించడం, అదే కోవలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్లు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్చిక సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక డైరెక్టర్ మధు, ఇతర చిత్ర బృందానికి అభినందనలు అంటూ నాగబాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.