Nagavamshi: ఆ డైరెక్టర్ కి 100 సార్లు చెప్పాను… మీడియా ముందే దర్శకుడికి ఇచ్చి పడేసిన నాగవంశీ?

Nagavamshi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉంటారు నిర్మాతలకు అభిమానులు ఉండడం చాలా అరుదు కానీ ఈ ప్రొడ్యూసర్ కి మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అంటే మీడియాకు మంచి స్టఫ్ దొరికినట్లే ఇక మీమర్స్ కి అయితే ఫుల్ మీల్స్ దొరుకుతుందని చెప్పాలి. ఈయన మీడియా ముందుకు వచ్చారు అంటే ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ తనదైన శైలిలోనే సమాధానాలు ఇస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఈ నెల 29వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగ వంశీ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా చిత్ర బృందం కూడా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు అడిగే ప్రశ్నలకు నాగవంశీ తనదైన శైలిలోని సమాధానం చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన టీజర్ చూసిన ఓ నెటిజన్ ఏకంగా 116 రూపాయలు డబ్బులను చదివించారు ఈ విషయం గురించి నిర్మాతకు ప్రశ్న ఎదురు కావడంతో ఆయన కూడా తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.

ఇప్పటికే నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి అందుకే 116 రూపాయలు మాత్రమే చదివించాను అని భారీ సెటైర్ వేశాడు. ఇక మీడియా వారు ముందే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కి నాగ వంశీ సాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం మ్యాడ్ సినిమా కంటే కూడా మరిన్ని రెట్లు వినోదాన్ని అందిస్తుంది అంటూ మాట్లాడటంతో నాగ వంశీ స్పందించారు డైరెక్టర్ గారికి నేను వందసార్లు చెప్పి ఉంటాను. సినిమా గురించి గొప్పలుగా మాట్లాడుకూడదని.

మా డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు చెప్పాను వేదికపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని మైక్ చేతిలో ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని చాలాసార్లు హెచ్చరించాను. అయినప్పటికీ ఆయన తన తీరును మార్చుకోలేదని తెలిపారు.అలాగే మ్యాడ్‌ కంటే 10 రెట్లు ఉంటుంది 20 రెట్లు ఉంటుంది అంటూ అనవసరంగా బిల్డప్ ఇవ్వద్దు అంటూ మీడియా ముందే డైరెక్టర్ కు నాగ వంశీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.