Balakrishna: డాకూ మహారాజ్ సూపర్ హిట్…. బాలయ్య కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నాగ వశీ?

Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరియర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈయన అఖండ సినిమా నుంచి వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నాలుగు సినిమాలు కూడా వందకోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ కావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు బాలకృష్ణ ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయితే భారం మొత్తం దర్శకుల పైన వేసేవారు కనీస మా సినిమా కథ వినడానికి కూడా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈయన కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో బాలకృష్ణతో సినిమా చేయాలంటే నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాకపోయేవారు.

ప్రస్తుతం మాత్రం బాలయ్య వరస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో బాలకృష్ణతో సినిమాలు చేయటానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో సక్సెస్ అందుకోవడంతో నిర్మాత నాగ వంశీ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలయ్యతో మరోసారి సినిమా చేయడానికి కూడా నాగ వంశీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగ వంశీ బాలయ్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని సమాచారం. తక్కువ పెట్టుబడితో ఈ సినిమా ఎక్కువ లాభాలను అందించిన నేపథ్యంలో నాగ వంశీ కియా కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ కారుని కూడా బుక్ చేశారని ఈ కారును బాలకృష్ణకు కానుకగా అందించబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే డైరెక్టర్ బాబితో కలిసి నాగ వంశీ బాలకృష్ణకు ఈ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.