బాలీవుడ్ సినిమా కోసం నాగచైతన్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా.. నిజంగా చైతుకి అవమానమే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న యువ సామ్రాట్ నాగచైతన్య గురించి పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే లవ్ స్టోరీ బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాగచైతన్య థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా అనంతరం నాగచైతన్య మొట్టమొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటించారు. అమీర్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగచైతన్య అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై బెంగళూరు వంటి నగరాలలో కూడా భారీగా ప్రెస్ మీట్ లు నిర్వహించి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం నాగచైతన్య తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన బాలీవుడ్ సినిమాలో నటించినందుకుగాను కేవలం ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. బాలీవుడ్ సినిమా కోసం నాగచైతన్య కేవలం ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నారంటే ఇది చాలా తక్కువ అని చెప్పాలి.