నాగచైతన్య లవ్ స్టోరీ బయటపడేది అప్పుడేనట

Naga Chaitanya'S Love Story Will Be Out On July End
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన చిత్రం ‘లవ్ స్టొరీ’.  శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మొదటి నుండి ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది.పాటలు కూడ సూపర్ హిట్ అయ్యాయి. సాయి పల్లవి, నాగచైతన్య కలిసి మొదటిసారి నటించడం కూడ సినిమాకి పెద్ద అస్సెట్ అయింది.  ఈ సినిమా మీద నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. సినిమా తప్పకుండా గ్రాండ్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. కానీ లాక్ డౌన్ వలన థియేటర్లు మూతబడటంతో విడుదల కుదరలేదు.  అన్ని పనులు పూర్తైన కూడ రెండు మూడు నెలలుగా విడుదల చేయకుండా ఆగిపోవాల్సి వచ్చింది. 
 
మధ్యలో ఓటీటీకి వెళ్లాలనే ఆలోచన వచ్చినా మేకర్స్ నిర్ణయం మార్చుకుని థియేటర్లలోకే రావాలని డిసైడ్ అయ్యారు. ఎట్టకేలకు ఇప్పుడు వారికి విడుదలకి ఆస్కారం కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా కేసుల సంఖ్య తగుతోంది. జూలై నెలలో కోవిడ్ నిబంధనలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేసిన తరువాత సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు చిత్ర నిర్మాతలు.  అంటే జూలై నెలాఖరుకు సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.  అంటే హిట్ అందుకోవాలనే నాగచైతన్య కోరిక జూలై ఆఖరుకు తీరుతుందన్నమాట. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles