అక్కినేని హీరో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆమిర్ ఖాన్ చేయనున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చైతూ ఒక కీ రోల్ చేయనున్నాడు. సుమారు 15 నుండి 20 నిముషాల నిడివి ఉన్న పాత్రలో చైతన్య కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకోగా ఆయన తప్పుకోవడంతో చైతన్యకు ఆ అవకాశం దొరికింది. అవకాశమైతే దొరికింది కానీ ఆ చిన్న పాత్ర చేయడానికి చైతూ చాలానే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తోందట. ఆమిర్ ఖాన్ అంటేనే మిస్టర్ పర్ఫెక్ట్. తనతో పాటు సినిమాలో ఉండే ప్రతి పాత్రలోనూ ఖచ్చితత్వం ఉండాలని పట్టుబడతారు.
అందులోనూ తనతో పాటే కనిపించే పాత్ర కావడంతో చైతూ పాత్రకు మరిన్ని డీటైల్స్ ఉంటాయట. ఆ పాత్రకంటూ ప్రత్యేకమైన మేకోవర్ ఉందట. ఆ మేకోవర్ సాధించడం కోసం చైతన్య కొత్త ఫిజిక్ తెచ్చుకోవాల్సి ఉంది. లాక్ డౌన్ ముగియగానే షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు ఆమిర్ ఖాన్. కాబట్టి ఆలోపు కొత్త లుక్ తెచ్చుకోవాలి చైతూ. సో.. చైతన్యకు ఆమిర్ ఖాన్ సినిమా చేయడం అంత ఈజీ అయిన పనేమీ కాదు.