రాశిఖన్నా డేట్ చేయాలనుకునే వ్యక్తి ఎవరో తెలుసా? హీరోయిన్ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..?

ప్రముఖ అందాల నటి రాశి ఖన్నా గురించి తెలియని వారంటూ ఉండరు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాశిఖన్నా తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అప్పటినుండి హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ నిత్యం బిజీగా ఉండే రాశి ఖన్నా ఇటీవల కూడా మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశికన్నా త్వరలోనే మరొక సినిమాతో సందడి చేయనుంది. నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించింది. జూలై 22వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చాలా జోరుగా సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య రాశి ఖన్నా పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ ఓ వీడియో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు నాగచైతన్య, రాశీఖన్నాలు ఒకరి గురించి ఒకర కరెక్ట్ సమాధానం చెప్పాలి. అయితే రాశీఖన్నా గురించి ఒకటి తప్ప అన్నీ కరెక్ట్ గా చెప్పాడు నాగచైతన్య.

అయితే రాశీ కన్నా మాత్రం నాగచైతన్య గురించి అన్నీ నిజాలే చెప్పింది. ఈ క్రమంలో రాశిఖన్నా ఒక షాకింగ్‌ విషయం బయటపెట్టింది. ఇటీవలి డేటింగ్‌ చేసేందుకు తను సిద్ధమే అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన రాశి కన్నా.. తాజాగా అది ఎవరితో అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు ఓ డాక్టర్‌తో డేటింగ్ చేయాలని తనకి కోరికగా ఉందంటూ రాశి ఖన్నా ఓపెన్ అయింది. అయితే రాశి కన్నా హీరోయిన్‌ కాకముందు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకుందట. కానీ డేట్ ‌కి మాత్రం ఓ డాక్టర్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది. రాశి ఖన్నా ఇలా చెప్పటంతో నాగచైతన్య చాలా ఫన్నీగా స్పందించారు. ఈ క్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ డాక్టర్లందరూ ఇది వింటున్నారా? ఇక అందరు ఆసుపత్రి లో డ్యూటీ మానేసి రాశీ ఇంటి బయట వెయిట్‌ చేస్తారని అంటూ కామెంట్ చేశాడు.