Naga Chaitanya : ఈ యంగ్ హీరోయిన్ తో చైతు ఆఫ్ లైన్ కెమిస్ట్రీ.. ఓ రేంజ్ లో వైరల్.!

Naga Chaitanya :  ఇటీవల గత కొన్ని నెలల మధ్య అక్కినేని వారి యంగ్ హీరో నాగ చైతన్య మరియు తన మాజీ భార్య సమంతా ప్రభు కి సంబంధించి ఏ వార్త అయినా ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే మంచో చెడో వారిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉండి సినిమాలు చేసుకున్నారు.

అయితే నెటిజన్స్ విషయంలో మాత్రం వీరు కాస్త తేడాగా ఏ చిన్న విషయం చేసినా అది మాత్రం ఇంకో లెవెల్లో వైరల్ అవుతుంది. అలానే ఇప్పుడు నాగ చైతన్య నెటిజన్స్ కి చిక్కడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాడు.

ఇంతకీ అసలు మేటర్ ఏమిటంటే తాను నటించిన లేటెస్ట్ సినిమాలలో ఒకటైన “బంగార్రాజు” రిలీజ్ కి రెడీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్ ఫంక్షన్ లో యంగ్ హీరోయిన్ అయినటువంటి దక్ష నగార్కర్ తో చిన్నగా అలా చూపులు కలిపాడు.

దీనితో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యిపోయింది. అయితే ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం కానీ ముందే ఒక అంచనాకి వచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ మొత్తమ్మీద అయితే ఈ ఇద్దరి వీడియో సోషల్ మీడియాలో ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.