బంజారాహిల్స్‌ ఘటన.. నిహారిక విషయంపై స్పందించిన నాగబాబు

బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో నిహారికను పోలీసులు అదుపులో తీసుకోవడంపై నటుడు నాగబాబు స్పష్టం చేశారు. తన కుమార్తెపై దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ రాడిసన్‌ బ్లూ పబ్‌ ఘటనపై నేను స్పందించటానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయంలో అక్కడ ఉండటమే. పబ్బును సమయానికి మించి నడపటం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించి అంతా క్లియర్‌గా ఉంది. పోలీసులు కూడా ఎలాంటి తప్పు లేదని చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను మీ ముందుకు వచ్చాను’అని వివరించారు.