AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. తాజాగా ఈయన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఇందులో భాగంగా జనసేన పార్టీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు అనంతరం ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని నాదెండ్ల మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయ్యేది కాదని నాదెండ్ల తెలిపారు. పవన్ కళ్యాణ్ కారణంగానే ఎన్డిఏ కూటమి సాధ్యం అయిందని కూటమి భారీ మెజారిటీని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఈ విధంగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ లేకపోతే నిజంగానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కాదని జనసైనికులు కూడా భావిస్తున్నారు.
స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్టును పూర్తిస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా మూలఖాత్ లో భాగంగా చంద్రబాబు నాయుడుని జైలులో కలిసి సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఈ చర్చలు అనంతరం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో తాను పొత్తు పెట్టుకుంటున్నాననీ తెలిపారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ పొత్తు కారణంగానే తెలుగుదేశం పార్టీకి తిరిగి జీవం పోసినట్టు అయిందని పవన్ అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కష్టం అంటూ జనసైనికులు కూడా పలు సందర్భాలలో ఈ విషయం గురించి ప్రస్తావించారు అయితే తాజాగా నాదెండ్ల మనోహర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
