పెద్ద హీరోల డేట్స్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి

Mythri movie makers grabs big stars dates
Mythri movie makers grabs big stars dates
తెలుగు పరిశ్రమల్లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. నవీన్ యార్నేని, యలమంచిలి రవిశంకర్ ఇందులో నిర్మాతలు. మొదటి సినిమాగా మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రీ మూవీస్ ఆ తర్వాత వరుసగా ‘రంగస్థలం, జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. ‘చిత్రలహరి, మత్తువదలరా’ లాంటి డీసెంట్ హిట్లు వీరి ఖాతాలో ఉన్నాయి.
 
మైత్రీ నుండి సినిమా వస్తుంది అంటే తప్పకుండా మంచి సినిమానే అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంతా ఈ సంస్థలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.   ప్రజెంట్ వీరు మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘అంటే సుందరానికి’ సినిమాలను నిర్మిస్తున్న వీరు చిరంజీవి, బాబీల చిత్రాన్ని, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాను, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, ప్రభాస్ హీరోగా ఒక పాన్ ఇండియా చిత్రం, రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను ఓకే చేసి పెట్టుకున్నాయి. 
 
ఇవి కాకుండా యంగ్ హీరోలు కొందరి డేట్స్ కూడ వీరి వద్ద ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇండస్ట్రీలోని టాప్ లీగ్ హీరోలందరి డేట్స్ వీరి వద్ద ఉన్నాయి. రానున్న రెండు మూడేళ్లలో టాలీవుడ్లో రాబోయే పెద్ద సినిమాలు చాలా వరకు వీరి నిర్మిస్తున్నవే కావడం విశేషం.