అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే దర్శకుడి మీద కన్నేశారు. అతనే కొరటాల శివ. ప్రజెంట్ ‘పుష్ప’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తర్వాతి సినిమాను కొరటాలతో చేయాలని అనుకున్నారు. ఈమేరకు ప్రాజెక్ట్ ప్రకటన కూడ జరిగింది. ‘పుష్ప’ పూర్తయ్యాక ఆ సినిమానే బన్నీ మొదలుపెట్టాలి. కానీ ఇంతలో సీన్లోకి ఎన్టీఆర్ దిగారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేయాల్సి ఉంది. కానీ కథ సెట్టవ్వక సినిమా కుదరలేదు. త్రివిక్రమ్ ఏమో మహేష్ బాబును చూసుకున్నారు. దీంతో తారక్ కొరటాలను అప్రోచ్ అవ్వడం జరిగింది.
సినిమాను కూడ ప్రకటించేశారు. దీంతో అల్లు అర్జున్ సినిమా డైలమాలో పడింది. అయితే తారక్, బన్నీలు కొన్ని చర్చల తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారట. బన్నీ కొరటాల సినిమాతో పాటు ‘ఐకాన్’ ప్రాజెక్ట్ కూడ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు సినిమా మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే బన్నీ కొరటాలకు గ్యాప్ ఇచ్చి ‘ఐకాన్’ చేసుకుంటే తారక్ సినిమాకు లైన్ క్లియర్ అవుతుందనే డిస్కషన్స్ జరిగాయట. బన్నీ కూడ ఓకే అన్నారట. దీంతో తారక్-కొరటాల ప్రాజెక్ట్ వెంటనే అఫీషియల్ అయిపోయింది. ఇక బన్నీ-కొరటాల సినిమా విషయానికొస్తే అది 2022 ఏప్రిల్ తరవాత సెట్స్ మీదకు వెళ్ళవచ్చు. ‘