బన్నీని డైరెక్ట్ చేయబోయేది మురుగదాసేనా ?

Murugadoss trying to impress Allu Arjun
Murugadoss trying to impress Allu Arjun
 
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చాలా నెలల నుండి హీరోల వేటలో ఉన్నాడు.  విజయ్ కథను రిజెక్ట్ చేసినప్పటి నుండి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. పైగా తమిళంలో స్టార్ హీరోల నుండి ఒక మోస్తారు హీరోల వరకు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడంతో మురుగదాస్ తెలుగు హీరోల కోసం కూడ ట్రై చేస్తున్నాడు.  ఆయన మొదటగా అప్రోచ్ అయిన హీరో అల్లు అర్జున్. కానీ కథ నచ్చక అల్లు అర్జున్ వెనక్కి తగ్గాడు.  ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ తో సంప్రదింపులు మొదలుపెట్టారట మురుగదాస్.  ఆయన ఒక కొత్త కథ చెప్పారని అల్లు అర్జున్ ఇంకా ఫైనల్ డెసిషన్ చెప్పాల్సి ఉందని టాక్. 
 
తాజాగా కూడ ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను తాను అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ ప్రాజెక్టులో భాగంగానే మురుగదాస్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నారని, ఎలాగైనా కథను ఫైనాల్ చేసుకునే పనిలో ఉన్నారని టాక్. మొత్తానికి బన్నీ కలైపులితో సినిమా అంటూ చేస్తే అది మురుగదాస్ దర్శకత్వంలోనే ఉంటుందని అంటున్నారు.  ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కుదిరితే ‘ఐకాన్’ తర్వాత ‘పుష్ప-2’ చేసి ఆతర్వాతే సినిమా చేస్తాడు అల్లు అర్జున్.  మరి స్టార్ హీరో కోసం తపిస్తున్న మురుగదాస్ లక్ ఎలా ఉందో చూడాలి.