ఎంఎస్ ధోనీ.. ఆయన గురించి చెప్పాలంటే ఎంత రాసినా సరిపోదు. ఆయన ఒక క్రికెట్ లెజెండ్. లేటు వయసులోనూ క్రికెట్ మీద మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి కసితో అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాడు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎంఎస్ ధోనీ.. ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో చాలామంది క్రికెట్ అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. ధోనీ నీ సేవలు ఇంకా ఈ దేశానికి అవసరమని చెప్పారు.
అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పినా.. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఆయన సీఎస్కే టీమ్ కు కెప్టెన్. సీఎస్కే టీం ఇన్ని సార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకున్నదంటే దానికి కారణం ధోని.
తాజాగా ఐపీఎల్ 2020 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం సందర్భంగా సీఎస్కే టీంకు చెందిన మాజీ ప్లేయర్ బద్రీనాధ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది కూడా ధోని మీద. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఐపీఎల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎస్కే ప్రాంచైజ్ గురించి మాట్లాడిన బద్రీనాథ్.. సీఎస్కే(చెన్నై సూపర్ కింగ్స్) టీమ్ కు కెప్టెన్ గా ఫస్ట్ ధోనీని అనుకోలేదని అన్నాడు. ముందుగా అసలు కెప్టెన్ గా ధోని వద్దనుకున్నారట. ధోని కన్నా భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా నియమించాలని భావించారట.
ముందు వీరేంద్ర సెహ్వాగ్ నే కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. తర్వాత ఏమైందో కానీ.. ధోనిని తీసుకున్నారు. 2008 లో ఐపీఎల్ ప్రారంభం అయింది. ఆ సమయంలో ఫస్ట్ చాయిస్ ఖచ్చితంగా వీరేంద్ర సెహ్వాగ్ కే ఉంటుంది. కానీ.. సెహ్వాగ్ పుట్టి పెరిగింది ఢిల్లీలో. అంటే ఆయనకు ఎక్కువగా ఢిల్లీతో సంబంధం ఉండటం వల్ల ఢిల్లీ టీమ్ అయితే తనకు బాగుంటుందని సెహ్వాగ్ చెప్పినట్టు బద్రీనాథ్ వెల్లడించాడు.
దీంతో ఢిల్లీ టీమ్ కు ఆడటానికి సెహ్వాగ్ కు చాన్స్ ఇచ్చారు. 2008 లో ఎంస్ ధోనికి చాలా డిమాండ్ ఉంది. అందకే 6 కోట్లు ఇచ్చి మరీ ధోనిని సీఎస్కే టీమ్ కోసం తీసుకున్నారు. అయితే.. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ.. సెహ్వాగ్ కాదంటేనే ధోనికి చెన్నై టీమ్ కెప్టెన్ అయ్యే అవకాశం లభించింది. సీఎస్కే టీమ్ కు ధోని రావడం అంటే.. ఒక దెబ్బకు మూడు పిట్టలు.. అన్నట్టే.. ధోని బెస్ట్ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్, ఎక్సలెంట్ వికెట్ కీపర్.. అంటూ ధోనిని ఆకాశానికెత్తాడు బద్రీనాధ్.
ఇక.. ఎంఎస్ ధోని నాయకత్వంలో సీఎస్కే టీమ్ 2010, 2011, 2018 లో ఐపీఎల్ కప్ గెలుచుకుంది. అంటే.. సెహ్వాగ్ ప్లేస్ లో ధోనిని తీసుకొని సీఎస్కే టీమ్ సరైన పని చేసింది అన్నట్టే కదా.