MS Dhoni: వ్యవసాయం చేస్తున్న మహేంద్రసింగ్ ధోని.. ఫొటోస్ వైరల్?

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆఖరి సారిగా ధోని 2019 వన్డే ప్రపంచకప్ లో భారత్ తరఫున మ్యాచులు ఆడారు. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. టార్జాన్ వికెట్ కీపర్ గా, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ కూల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఎంతో మంది క్రికెటర్లకు ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు మహేంద్రసింగ్ ధోని.

అయితే మొదటి తో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో అనగా క్రికెట్ నుంచి ధోని రిటైర్ అయిన తరువాత మైదానంలో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. కానీ భారతీయ యువతలో ధోనీ నింపుతున్న స్ఫూర్తి అలాగే కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ రైతు గా మారాడు. అయితే ఇదేదో సరదా కోసం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ నిజంగానే పూర్తిస్థాయి రైతుగా మారిన పంటలు పండిస్తున్నారు. అంతర పంట పద్ధతిలో ఆవాలను సాగు చేస్తున్నాడు. ఆవాల తో పాటు క్యాబేజీ, అల్లం, క్యాప్సికం వంటి అనేక రకాల కూరగాయలు స్ట్రాబెర్రీలు కూడా పండిస్తున్నాడు.

ఇకపోతే ఇటీవలే పంటలు పరిశీలించడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన దోనీ అతని సాగుకు సలహాదారుడు అయిన రోషన్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు అతనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ధోని కి కూరగాయలు అంటే అమితంగా ఇష్టమని, ప్రతిసారీ రాంచీ నుంచి వచ్చినప్పుడు తాను పండించిన కూరగాయలు మాత్రమే తింటాడు అనీ రోషన్ చెప్పుకొచ్చాడు.