కాషాయం కోరిక తీర్చలేకపోతున్న మోత్కుపల్లి

motkupalli telugu rajyam

 తెలంగాణ టీడీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దళిత నేత మోత్కుపల్లి నరసింహులు. ఒక దశలో తెలంగాణ తరుపున గవర్నర్ పదవి కోసం టీడీపీ పార్టీ మోత్కుపల్లి ని సిఫారస్సు చేయటం జరిగింది. అలాంటి నేత ఇప్పుడు ఏపార్టీ లో ఉన్నాడో కూడా సరిగ్గా తెలియని పరిస్థితి నెలకొని వుంది. తెలంగాణాలో టీడీపీ పార్టీ అంతంతమాత్రంగా ఉన్నప్పుడే బాబుతో కయ్యం పెట్టుకొని, బాబు గెలవకూడదు అంటూ తిరుపతి వెళ్లి మొక్కున్నాడు మోత్కుపల్లి. దీనితో టీడీపీ నుండి ఆయన్ని బహిష్కరించారు. ఆ సమయంలో తెరాస పార్టీలో చేరుతాడేమో అనుకున్నారు, కానీ తెరాస వైపు నుండి మోత్కుపల్లి కి సానుకూల పవనాలు రాలేదు.

motkupalli narasimhulu telugu rajyam

 

  గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ని ఒక రేంజు లో టార్గెట్ చేస్తూ మోత్కుపల్లి విరుచుకుపడేవాడు. బహుశా కేసీఆర్ వాటిని మర్చిపోలేకపోయాడో, లేక మరేదైనా కారణం ఉందేమో కానీ మోత్కుపల్లి కారెక్కటానికి కుదరలేదు. దీనితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అప్పటి తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ కలిసి మోత్కుపల్లి ఇంటికి వెళ్లి ఆయన్ని బీజేపీలో చేరాలని కోరటం జరిగింది. అయితే మోత్కుపల్లి తన రాజకీయ భవిష్యత్తుపై వాళ్ళ నుండి హామీ తీసుకోని పార్టీలో చేరాడు.అయితే మోత్కుపల్లి చేరినప్పుడే కనిపించాడు తప్పితే, తర్వాత పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. పార్టీలో తనకి సరైన గుర్తింపు లేదని, మొదటిలో ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట చెపుతున్నారని అందుకే అలకబూనిన మోత్కుపల్లి బీజేపీ కి దూరంగా వుంటున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

  అయితే బీజేపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది . తెలంగాణలో పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది, ఇలాంటి సమయంలో మోత్కుపల్లి లాంటి సీనియర్ నేత పబ్లిక్ లోకి వచ్చి పార్టీ తరుపున తన వాయిస్ గట్టిగా వినిపిస్తూ, సీఎం కేసీఆర్ ను దైర్యంగా ఢీకొట్టాలి కానీ, అవేమి చేయకుండా ఒక సాధారణ కార్యకర్తగా వుంటుంటే, ఎలా ఆయనకి పార్టీలో గుర్తింపు ఇవ్వాలని అంటున్నారు. గుర్తింపు లాంటిది ఏమి లేకుండా ఏ విధంగా పార్టీ తరుపున మాట్లాడాలి అంటూ మోత్కుపల్లి చెపుతున్న మాట. ఈ వివాదం చాప కింద నీరులా వ్యాప్తిస్తూ వెళ్లటంతో మోత్కుపల్లికి బీజేపీకి మధ్య దూరం బాగా పెరిగిపోతుంది. కొత్తగా వచ్చిన బండి సంజయ్ కూడా మోత్కుపల్లి విషయంలో అంటిముట్టనట్లే ఉన్నాడు.

revanth motkupalli

 ఇలాంటి తరుణంలో మోత్కుపల్లి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీలో ఇప్పటికే అనేక వర్గాలు, గొడవలు తారా స్థాయిలో వున్నాయి. రేవంత్ రెడ్డి లాంటి నేత కాంగ్రెస్ పార్టీలో నెట్టుకొని రావటానికి ఆపసోపాలు పడుతున్నాడు, అలాంటిది ఇక మోత్కుపల్లి వెళ్లిన ఒకటే, రాజకీయ సన్యాసం తీసుకున్న ఒకటే, అందుకే ఆ ఆలోచన వచ్చిన కానీ విరమించుకున్నట్లు తెలుస్తుంది. రేపు జరగబోయే, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి, బీజేపీలో మళ్ళీ యాక్టీవ్ కావాలా..? లేదా..? అనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది