ప్రస్తుతం అంతా ఆన్ లైన్ క్లాసులే కదా. కరోనా వల్ల స్కూళ్లు మూతపడటంతో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆన్ లైన్ క్లాసులే దిక్కు. దీంతో పిల్లలంతా స్మార్ట్ ఫోన్లు పట్టుకొని క్లాసులు వింటున్నారు.
అయితే.. ఈ ఆన్ లైన్ క్లాసులో ఒక్కోసారి కొంప ముంచుతున్నాయి. ఆన్ లైన్ క్లాసుల వల్ల పిల్లలు పెద్దగా ఆసక్తిని కనబర్చలేకపోతున్నారు. ఇంట్లో అందరూ ఉండటం, పిల్లలు ఒక చోట కూర్చొని ఆన్ లైన్ క్లాసులు వినలేకపోవడం.. ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి.
ఒక్కోసారి పిల్లలు ఆన్ లైన్ క్లాస్ వింటున్నారన్న విషయం మరిచిపోయి తల్లిదండ్రులు కూడా ఏవేవో చేస్తుండటం కెమెరాలకు చిక్కాయి.
తాజాగా.. అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నది. కూతురు ఆన్ లైన్ క్లాస్ వింటుండగా.. తన తల్లి నగ్నంగా కెమెరా ముందు వచ్చింది. వెంటనే తేరుకున్న ఆమె.. అక్కడ ఆన్ లైన్ క్లాస్ జరుగుతోందని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు రోజూ నమోదవుతుండటంతో ఆన్ లైన్ క్లాసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ జూమ్ చదువులు ఏంటో? పిల్లలకు ఈ ఆన్ లైన్ క్లాసులు ఏం అర్థమవుతున్నాయి. కుదిరితే.. పిల్లలకు సపరేట్ రూం ఇచ్చి.. అందులో కూర్చొపెట్టి చదివించాలి కానీ.. అందరూ ఇంట్లో ఉండగా.. ఓవైపు పెద్దల మాటలు, మరోవైపు క్లాస్ వినడం.. పిల్లలకు ఎలా సాధ్యం అవుతుంది? అంటూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెర లేపారు నెటిజన్లు.
https://twitter.com/Mufaa6/status/1312802083918303232