Mohan Babu – Mahesh Babu: మహేష్,త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరో..ఎవరో తెలుసా?

Mohan Babu – Mahesh Babu: టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు ఎక్కువగా వారి సినిమాల్లో ఒకప్పటి సినిమా ఆర్టిస్టులను సినిమాల ద్వారా ఎక్కువగా పరిచయం చేస్తూ ఉంటారు. సీనియర్ హీరోయిన్ టబు ని అలా వైకుంఠపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే కాకుండా ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారు. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాగే చేశారు. త్రివిక్రమ్ తాజాగా తన సినిమాలో నటించడం కోసం టాలీవుడ్ స్టార్ హీరో అయినా మోహన్ బాబు ని తీసుకున్నారు.

అంతేకాకుండా మోహన్ బాబు కోసం ఒక ఫుల్ రోల్ ని కూడా డిజైన్ చేశారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ మోహన్ బాబు ని అప్రోచ్ కూడా అయ్యారట. ఈ క్రమంలోనే మోహన్ బాబు త్రివిక్రమ్ పై నాలుగు పంచులు వేసి, చేస్తానని కానీ చెయ్యను అని కాని చెప్పకపోగా త్రివిక్రమ్ ను కన్ఫ్యూజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో మోహన్ బాబు పెద్దగా సినిమాలు తీయడం లేదు కాబట్టి ఒకవేళ సినిమాల్లో నటిస్తే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే ఉండాలి అని మోహన్ బాబు తాపత్రయపడుతున్నారు.

ఇటీవలే విడుదలైన మహానటి , ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాల్లో మోహన్ బాబు నటించిన పాత్రలకు మంచి పేరే వచ్చింది. త్రివిక్రమ్ కూడా తన సినిమాలో మోహన్ బాబు పాత్ర ను కాస్త ఆసక్తిగానే చూపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం మోహన్ బాబు ఈ సినిమాను చేస్తారా లేదా తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి. మహేష్ బాబు మోహన్ బాబుతో కలసి కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించాడు. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు నటి ఇస్తాడా లేదా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.