Mohan Babu: రౌడీ గారి పెళ్లాం సినిమాలో చేస్తున్నపుడు తాను చాలా చిన్న ఆర్టిస్ట్‌ని అని, అప్పుడే లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్‌కు తాను ఎంటరయ్యానని ప్రముఖ సీనియర్ నటి శివ పార్వతి తెలిపారు. ఆ సినిమాలో హీరోయిన్ శోభన అని, ఆమె తనను విష్ చేయలేదని, తనను మోహన్ బాబు ఆమె దగ్గరికి పిలిచి ఆవిడ ఎవరనుకుంటున్నావ్, ఎక్స్‌లెంట్ ఆర్టిస్ట్ నువ్వెందుకు విష్ చేయలేదని అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. అదేంటీ ఆయన ఎందుకలా అడుగుతున్నారని తాను అనుకున్నానని, కానీ ఆయన మాత్రం మనమూ, వాళ్లు ఒకటే.. చిన్న ఆర్టిస్ట్ అని అనుకుంటున్నావేమో అని ఆయన అన్నారని ఆమె చెప్పారు. నిజంగా ఆయన మైండ్‌లోకి ఆర్టిస్ట్ అన్న భావన వస్తే వాళ్లు చిన్న క్యారెక్టర్ చేస్తున్నారా ? కొంచెం రెమ్యునరేషనే తీసుకుంటున్నారా ? అనేవి ఆలోచించరని, వాళ్లకు ఆయన చాలా గౌరవం ఇస్తారని ఆమె స్పష్టం చేశారు.
మామూలుగా మోహన్ బాబు గారి గురించి చాలా మంది నెగెటివ్‌గా చెప్తారు గానీ ఎలా అంటే ఆయన పని రాక్షసుడు, పిశాచి అని.. కానీ తాను మాత్రం వాటన్నంటికీ రివర్స్‌లో చెప్తానని ఆమె అన్నారు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్లే ప్రస్తుతం ఇండస్ట్రీకి కావాలని ఆమె చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరికీ టైం సెన్స్ లేదన్న ఆమె, షూటింగ్ సమయం అయిపోతున్నా కూడా కొంతమంది మాత్రం లేట్‌గా వస్తారని ఆమె అన్నారు.
కాబట్టి మోహన్ బాబు లాంటి వాళ్లు గనక లేకపోతే ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోవాల్సి ఉంటుందని శివ పార్వతి చెప్పారు. 7 అంటే 7 గంటలకు షూట్‌లో ఉండాలని, అదీ గాక డబ్బు విషయంలోనూ ఎలాంటి పేచీలు పెట్టరని ఆమె అన్నారు. అలాంటి విషయాల్లో ఆయనకు కోపమొస్తుంది గానీ, మిగతా అంతా చాలా బాగుంటారు అని ఆమె స్పష్టం చేశారు. కానీ ఆ సిన్సియారిటీనే ప్రస్తుతం ఇండస్ట్రీకి కావాలని ఆమె మరోసారి నొక్కి చెప్పారు. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుందని కూడా శివ పార్వతి తెలిపారు.