Mohan Babu: ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది.. శుభవార్త చెప్పిన మోహన్ బాబు!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నటుడిగా కొనసాగుతూ ఎన్నో విలక్షణమైన పాత్రలలో, హీరోగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో మోహన్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా గత రెండున్నర దశాబ్దాల కాలం నుంచి శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలను నడుపుతూ ఎంతో మందికి తన విద్యా సంస్థల నుంచి కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత మోహన్ బాబు విద్యాసంస్థలకు ఉందని చెప్పవచ్చు.

ఇలా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా ప్రతి ఒక్క కోర్సును విద్యార్థులకు అందుబాటులో ఉంచిన మోహన్ బాబు చాలా కాలం నుంచి తన విద్యాసంస్థని యూనివర్సిటీగా మార్చుకోవాలనే కల ఉండేది.ఎన్నో సంవత్సరాల తన కల నేటితో నెరవేరిందని తన విద్యానికేతన్ యూనివర్సిటీ గా గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా మోహన్ బాబు ఎంతో సంతోష పడుతూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

చిన్న మొలకలుగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ నేడు కల్పవృక్షంగా మారిపోయింది. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు యూనివర్సిటీ విద్యా విశ్వంలోకి చేరుకున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను మీ ప్రేమే నా బలం మీ మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.