‘పంచతంత్ర కథలు’ మూవీ ట్రైలర్ విడుదల చేసిన ఎంఎం కీరవాణి

‘పంచతంత్ర కథలు’ సినిమాకు కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు గంగనమోని శేఖర్. ఇక ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1 గా వ్యాపారవేత్త డి.మధు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సినిమా ఐదు వేర్వేరు కథల నేపథ్యంలో రూపొందుతుంది కాబట్టి దీనికి పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు.

ఇక ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా 5 వేరు వేరు కథలలో.. వేరు వేరు జోనర్లతో రావడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. ట్రైలర్ చాలా బాగుంది అని.. క్యారెక్టరైజేషన్స్ కొత్త కొత్తగా ఉన్నాయి అంటూ.. అంతేకాకుండా ఇందులో మా ఫ్యామిలీ మెంబర్ నోయల్ కూడా నటిస్తున్నాడు అని.. ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు.

Panchatantra Kathalu Trailer | NOEL | NANDINI RAI | NIHAL|SAI RONAK|PRANEETA PATNAIK|GEETHA BHASCKER