టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఓ వ్యక్తిని తిడుతున్న వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ గ్రామస్తుడిని పట్టుకొని రసమయి తీవ్ర పదజాలంతో దూషించాడు.
అసలు ఏం జరిగిందంటే… కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామాన్ని ఎమ్మెల్యే రసమయి పర్యటించలేదట. తమ గ్రామంలో ఎందుకు ఎమ్మెల్యే పర్యటించడం లేదంటూ… అదే గ్రామానికి చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు… తమ ఊళ్లో ఉన్న సమస్యలను తెలుపుతూ.. ఆ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఆ పోస్టును చూసిన ఎమ్మెల్యే రసమయి.. వెంటనే అతడికి ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. ఆ వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా బూతులు తిట్టడం కరెక్ట్ కాదని అన్నాడు. అయినా కూడా వినకుండా.. రసమయి.. నువ్వు కాల్ రికార్డు చేసుకున్నా పర్వాలేదు అంటూ తిట్ల పురాణం లంకించుకున్నాడు. ఆ వ్యక్తి కూడా రసమయిపై బాగానే ఫైర్ అయ్యాడు. మొత్తానికి ఇద్దరి మధ్య బూతు పురాణం నడిచింది.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూస్ చానెళ్లలోనూ వీళ్ల సంభాషణకు సంబంధించిన ఆడియోను ప్రసారం చేశారు.
(Video Courtesy: NTV)