ఆర్ఎక్స్ 100′ చిత్రంతో డైరెక్టర్ అజయ్ భూపతి హాట్ షాట్ అయ్యారు. అయితే అంత పెద్ద విజయం తర్వాత మరో సినిమా చేయడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. పలువురు హీరోల దగ్గరకు కథ పట్టుకుని తిరిగిన అజయ్ భూపతికి చివరకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో సిద్దార్థ్ ఒక కీ రోల్ చేయనుండగా అదితిరావ్ హైదరి కథానాయికగా చేస్తోంది. మొదట్లో పలువురు హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడంతో నెగెటివిటీ మొదలైంది. స్క్రిప్ట్ బాగోలేదనే మాటలు వినబడ్డాయి. ఎలాగోలా అజయ్ షూటింగ్ మొదలుపెట్టి కొంత చిత్రీకరణ ముగించాక కూడ ఇదే టాక్.
అవుట్ ఫుట్ సరిగా రావట్లేదు అని. దీంతో అజయ్ కూడ చాలామంది దర్శకుల్లాగానే వన్ టైమ్ వండర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అజయ్ భూపతి వర్క్ మీద పాజిటివ్ మాటలు వస్తున్నాయి. సినిమాను చాలా బాగా తీస్తున్నాడని, మాస్ ప్రేక్షకుల్ని గట్టిగా టార్గెట్ చేశాడని, కొత్త తరహా స్పెషల్ సాంగ్ ఒకటి చేస్తున్నాడని, సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ‘మహాసముద్రం’ మీద కాసేపు బాగుందని, కాసేపు బాగోలేదని రకరకాల టాక్స్ వినిపిస్తుండటంతో వినే వారికి అస్సలు గురి కుదరడంలేదు.