పవన్ కళ్యాణ్ కు అహం ఉంటుందన్న మంత్రి అవంతి!

నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ పలువురు నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో అవతలి పార్టీ వాళ్ళు పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. అందులో తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా కౌంటర్లు వేసాడు. పవన్ సినిమాలలో మాత్రమే హీరో అని, రాజకీయంగా తాను హీరో అని అన్నాడు.

పలు పార్టీల తో పవన్ కళ్యాణ్ కు పొత్తు ఉందా అంటూ ప్రశ్నలు వేశాడు. రాష్ట్రానికి టూరిస్ట్ గా వచ్చే పవన్ కళ్యాణ్ అభివృద్ధి గురించి మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించాడు. ఆయనకు అహం ఎక్కువగా ఉంది అని.. అందుకే తన సినిమాలు అధికశాతం ప్లాప్ అవుతున్నాయని అన్నాడు. పైగా వాస్తవాలు తెలుసుకో రా అంటూ మరికొన్ని వ్యాఖ్యలతో పవన్ ను దారుణంగా విమర్శించాడు.