ఆ ఒక్క ఏరియాలోనే ‘RRR’ మైండ్ బ్లాకింగ్ బిజినెస్.!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి చేసిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మొత్తం అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కొన్ని ఏరియాలకు సంబంధించి బిజినెస్ లెక్కలు బయటకు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక్క తిరుపతి బిజినెస్ ఫిగర్ వైరల్ అవుతుంది. కేవలం ఈ ఒక్క ఏరియాలో 4.5 కోట్లు జరుపుకుందట. ఇది ఇప్పుడు వరకు ఏ సినిమాకి కూడా జరగని స్థాయి బిజినెస్ అట.

దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవాలి. మరి ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాణం అందించారు. ఇప్పుడు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.