దాదాపు ఒక పది పన్నెండు ఏళ్ళు కితం ఇండియన్ సినిమా దగ్గర ఓ నాన్ ఇండియన్ సినిమాకి ఊహించని రేంజ్ క్రేజ్ కనిపించింది. అప్పట్లోనే అతి తక్కువతికేట్ ధరలతో ఎన్నెన్నో హౌస్ ఫుల్స్ జనం థియేటర్స్ బయట క్యూ లు అబ్బో ఎన్నో చూపించిన బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ హాలీవుడ్ చిత్రం “అవతార్”.
హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ క్యామెరాన్ తెరకెక్కించిన ఈ కొత్త ప్రపంచపు సినిమా సినీ అభిమానులని నిజంగా అప్పట్లో పండోర లోకానికి తీసుకెళ్ళిపోయింది. దీనితో ఈ చిత్రం అప్పుడు 3డి లో కూడా లేకుండా ఇప్పుడుకి కూడా 2 బిలియన్ కి పైగా వసూళ్లు అందుకున్న సినిమాగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర నిలిచింది.
అయితే ఇక ఇప్పుడు ఫైనల్ గా ప్రపంచం ఎదురు చూస్తున్న ఆ సీక్వెల్ అవతార్ 2 అయితే డిసెంబెర్ లో రిలీజ్ కి సిద్ధం కాగా ఈ సినిమాపై మరి ఎలాంటి డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి సౌత్ లో మైండ్ బ్లాకింగ్ బిజినెస్ ని డిమాండ్ చేస్తున్నారట. ఒక్క తెలుగులోనే 100 కోట్ల డిమాండ్ ఈ సినిమాకి నెలకొన్నట్టు తెలుస్తుంది.
అలాగే తమిళ్ వెర్షన్ కి 50 కోట్లు కన్నడ వెర్షన్ లో ఇంకో 50 కోట్లు సినిమాకి ధర పెట్టినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి వీటిలో తెలుగు హక్కులనే 100 కోట్లకి పెట్టడం విశేషం. దీని బట్టి తెలుగులో మన వాళ్ళు సినిమాలు ఏ లెవెల్లో చూస్తారో వారికి అర్ధం అయ్యి ఉండొచ్చు. ఇక వీటికే ఇలా అంటే హిందీలో ఏ రేంజ్ బిజినెస్ ఈ సినిమాకి జరుగుతుందో అని అందరిలో మరింత ఆసక్తి స్టార్ట్ అయ్యింది.