బీజేపీ దెబ్బకు మామా అల్లుళ్లుకు మైండ్ బ్లాక్

kcr harish rao

 దుబ్బాక ఉప పోరులో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ కు ముందు ఈ ఉప ఎన్నికలలో తెరాస విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు , కానీ రాను రాను తెరాస కు బీజేపీ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. నిజానికి దుబ్బాకలో బీజేపీకి పెద్దగా బలం లేదు, తెరాస, కాంగ్రెస్ మద్యే ప్రధాన పోటీ ఉండేది, కానీ రఘునందన్ రావు దుబ్బాకలో తన పట్టు పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, చాలా రోజుల ముందు నుండి రఘునందన్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి, గ్రామగ్రామాన తన క్యాడర్ ను సిద్ధం చేసుకున్నాడు, అదే సమయంలో తన వాక్చాతుర్యంతో అనేక మీడియా డిబేట్స్ లో బీజేపీ వాణి బలంగా వినిపిస్తూ ఒక బలమైన నేతగా ప్రజాదరణ పొందాడు. దీనితో తెరాస కు అతనే ప్రధాన ప్రత్యర్థి అయ్యాడు.

raghu nandan rao

 ఇక ఎన్నికల ప్రచారం యమజోరుగా సాగుతున్నతరుణంలో రఘునందన్ ఇంట్లో డబ్బు సంచులు దొరికాయనే వార్తతో ఒక్కసారిగా దుబ్బాక రాజకీయం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇదే సమయంలో బండి సంజయ్ మీద పోలీసులు దాడి చేశారనే వార్త కూడా దీనికి మరింత ఆజ్యం పోసింది. నిజానికి ఇలాంటి సమయాల్లో పోటీచేస్తున్న అబ్యర్దుల ఇంట్లో డబ్బులు దొరికితే, వాళ్ళకి చెడ్డ పేరు రావటం, ప్రజాదరణ కోల్పోవటం జరుగుతుంది, కానీ దుబ్బాకలో మాత్రం రఘునందన్ మీద సానుభూతి రావటం విశేషం, ఇక్కడ బీజేపీ అనుసరించిన వ్యూహాలే ప్రధాన కారణమని తెలుస్తుంది.

 పోలీసులు సోదాలు వచ్చిన సమయంలో బీజేపీ కార్యకర్తలు చాకచక్యం వ్యవహరించి, పోలీసులే డబ్బు సంచులు పెట్టటానికి వచ్చారనే వార్తను వీడియోలతో సహా చూపించారు, మరోపక్క బండి సంజయ్ ను పోలీసులు కారులో కుక్కి తీసుకునే వెళ్తున్న సమయంలో బాధతో సంజయ్ చేస్తున్న ఆర్తనాదాలు కూడా వీడియో రూపంలో బయటకు వచ్చాయి, దీనితో కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ కి విపరీతమైన సానుభూతి వెల్లువెత్తింది. తెరాస మీద అదే స్థాయిలో వ్యతిరేకత కూడా రావటం జరిగింది.

dubbaka

 ఇందులో తెరాస హస్తముందని సామాన్య ప్రజలు కూడా ఒక అంచనాకు వచ్చేశారు , గతంలో ఉత్తమ్ కుమార్ , రేవంత్ రెడ్డి ఇళ్లలో కూడా ఎన్నికలకి ముందు పోలీసులు దాడులు చేయటం జరిగింది, కాబట్టి ఇలాంటి పనులు తెరాస కు కొత్తేమి కాదులే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందువలనే రఘునందన్ బంధువుల ఇళ్లలో డబ్బు దొరికిన కానీ, దానిని ఎవరు పెద్ద తప్పుగా పట్టించుకోవటం లేదు, ఇక్కడ తెరాస పార్టీ తన పాత ఫార్మలా అమలుచేస్తే, బీజేపీ దానిని సరికొత్త ఎత్తుగడతో చిత్తూ చేసింది. ఇది ఖచ్చితంగా తెరాస కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. లక్ష మెజారిటీ సాధిస్తామని చెప్పుకుంటున్న మామ అల్లుళ్లకు ఊహించని షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట