మిలిటరీ హెలికాప్టర్ కూలి 14 మంది దుర్మరణం…!

ప్రజలు ప్రయాణాలు చేసే సమయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికి అవగాహన ఉండదు. కొన్ని సందర్భాలలో ప్రమాదం ఏ రూపంలో పొంచి వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలే కాకుండా, రైళ్లు అదుపు తప్పటం, విమానాలు కూలిపోవడం వల్ల కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల మెక్సికోలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. అయితే ఈ ఘటన పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే… మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో ఈ హెలికాప్టర్ కూలిన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన పట్ల అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఏమిటంటే ఈ హెలికాప్టర్ ఘటన జరిగిన రోజు అక్కడి అధికారులు మెక్సికోలోని ఒక ప్రముఖ డ్రగ్ డీలర్‌ను అరెస్ట్ చేశారు.అతనిని అరెస్ట్ చేసిన కొంత సమయానికే హెలికాప్టర్ కూలిపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. శుక్రవారం సినాలోవా రాష్ట్రంలో నేవీ అధికారులు రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేశారు. రాఫెల్ మెక్సికో లో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. ఇతను గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను కూడా నడిపిస్తున్నాడు. అంతే కాకుండా కొందరి హత్యలతో కూడా ఇతనికి సంబంధం ఉంది .

రాఫెల్ కి ఒక హత్య కేసులో 18 ఏళ్లు జైల్లో శిక్ష కూడా అనుభవించాడు.అమెరికాకు చెందిన ఒక యాంటీ నార్కొటిక్స్ ఏజెంట్‌తోపాటు, పలువురి హత్యతో కూడా రాఫెల్‌కు సంబంధం ఉంది. అయితే, ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ దేశ పౌరుడిని హత్య చేయడమే కాకుండా ఇతర హత్య కేసులతో కూడా అతనికి సంబంధం ఉండటంతో అతనిని అరెస్టు చేయాలని అమెరికా చాలా రోజుల నుంచి కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం మెక్సికోపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మెక్సికో ప్రభుత్వం రాఫెల్‌ను శుక్రవారం నేవీ అరెస్టు చేసింది. అయితే రాఫెల్ ని అరెస్టు చేసిన కొంత సమయానికి హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ ఘటనకి రాఫెల్ అరెస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా అంటూ అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా ఒకరు గాయాలతో బయటపడ్డారు.