Megastar On Rajamouli Sentiment : రాజమౌళి సెంటిమెంట్ పై మెగాస్టార్ సాలిడ్ కాన్ఫిడెన్స్ కామెంట్స్.!

Megastar On Rajamouli Sentiment : తెలుగు దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.
అయితే నిన్ననే ఈ భారీ సినిమాకి సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. మరి ఈ వేదికపై మెగాస్టార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలే చెప్పారు. రాజమౌళితో సినిమా చేసాక హీరోలకి నెక్స్ట్ సినిమా సరిగ్గా సక్సెస్ కాదు అనే టాక్ ఉంది. అవి కేవలం ఇతర కారణాల వల్ల జరిగి ఉండొచ్చు కానీ అది నిజం కాదని నేను నమ్ముతాను అని తెలిపారు.
ఎందుకంటే తాను తీసిన RRR లో రామ్ చరణ్ చేసాడు అలాగే మా ఆచార్య లో కూడా చేసాడు. కానీ ఆచార్య మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యి తీరుతుంది రాజమౌళి సినిమా తర్వాత ఉన్న మార్క్ ని బ్రేక్ చేస్తుంది అని సాలిడ్ కాన్ఫిడెన్స్ తో మెగాస్టార్ స్టేట్మెంట్ ఇచ్చారు.
దీని బట్టి ఈ సినిమా సబ్జెక్టు విషయంలో మెగాస్టార్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.