వైరల్ : తన సినిమా కెరీర్ ముగింపుపై మెగాస్టార్ సంచలన కామెంట్స్.!

Megastar Sensational Comments

Megastar Sensational Comments : తెలుగు సినిమా వద్ద ఉన్న ఎందరో దిగ్గజ నటుల్లో ఒక ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ అలాగే శోభన్ బాబులు ఎలాగో వారి తర్వాత తెలుగు సినిమాని మరో వైపుకి తీసుకెళ్లి దాదాపు మూడున్నర దశాబ్దాలు నెంబర్ 1 గా ఉన్న ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవే అని చెప్పాలి.

ఇప్పటికీ కూడా తనకి 66 ఏళ్ళు వచ్చినా అదే గ్రేస్ మరియు ఎనర్జీ తో నటిస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిరు కి నటన అంటే ఎంత ఇష్టమో తన శక్తి మేర ఇప్పుడున్న పరిస్థితిలో కష్టపడతారో ఆచార్య సినిమాలో గాని ఆ దర్శకుడు కొరటాల శివ చెప్పిన మాటల్లో గాని అర్ధం అయ్యాయి.

అయితే మెగాస్టార్ రీసెంట్ గా ఎప్పుడు ఎక్కడ చెప్పారో గాని కొన్ని సంచలన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారాయి. తన సినిమా కెరీర్ ముగింపుపై చేసిన ఈ కామెంట్స్ కాస్త ఎమోషనల్ గా కూడా ఉన్నాయని చెప్పాలి.

ఇంతకు తాను ఏమని చెప్పారంటే నాకు నటన అన్నా సినిమా అన్నా చాలా మక్కువ అని నాకు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ఇవి ఎక్కడ అన్నారో కానీ మెగా ఫ్యాన్స్ లో అయితే ఈ ఎమోషనల్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.