Bholaa Shankar : “భోళా శంకర్” ఫస్ట్ లుక్ తో దుమ్ము రేపిన మెగాస్టార్.!

Bholaa Shankar : మన సీనియర్ అండ్ స్టార్ హీరోస్ ని మాంచి ఎనర్జిటిక్ రోల్స్ లో చూస్తే ఆ కిక్కే వేరు అని చెప్పాలి. అలా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. 6 పదుల వయసు ఉన్నా కూడా అదే మాస్ ఎనర్జీ తో చిరు ఇప్పటికీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
మరి ఇప్పుడు తాను చేస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో ఒకటైన “భోళా శంకర్” నుంచి చిత్ర బృందం చెప్పినట్టుగా బిగ్ అప్డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు. మాస్ అండ్ వెరీ స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ కనిపించి దుమ్ము రేపారు.
అలా ఆ ట్రక్ జీప్ కి ముందు కూర్చొని తన మాస్ స్వాగ్ ని కనబరుస్తూ అభిమానులకి గట్టి ట్రీట్ ఇవ్వడం ఖాయం అనేలా కనిపిస్తున్నారు. మొత్తానికి అయితే దర్శకుడు మెహర్ రమేష్ మెగాస్టార్ ఇచ్చిన అవకాశాన్ని బాగానే వినియోగించుకుంటున్నాడని చెప్పాలి.
మరి ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు తమన్నా లు కనిపించనుండగా మరికొంతమంది సినీ ప్రముఖులు భాగం అయ్యారు. అలాగే మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు క్రియేటివ్ కమెర్షియల్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.