నిన్ననే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత తన ఆరోగ్యం కోసం ఒక ఊహించని అప్డేట్ ని అయితే షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. తాను మెంటల్ గానే కాకుండా శారీరకంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నానని అయినా సరే పరిస్థితులు నుంచి మళ్ళీ కం బ్యాక్ అవుతానని బలంగా చెప్పింది.
దీనితో సమంత ఆరోగ్యం పట్ల టాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ ఆమెకి ధైర్యం చెప్తుండగా ఇప్పుడు సమంత కి అండగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అయితే మెగాస్టార్ మాత్రం కాస్త ఆసక్తికర పోస్ట్ ని పెట్టారని చెప్పాలి.
ఆమెకి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇస్తూ డియర్ సామ్ సమయానుగుణంగా మనలోని లోలోపల శక్తిని పెంచుకోవాలి నాకు తెలుసు నువ్వొక వండర్ ఫుల్ మహిళవి నీలో ఆ అంతర్గత శక్తి దాగ్గి ఉంది, డెఫినెట్ గా నువ్ ఈ ఛాలెంజ్ ని అధిగమించి మళ్ళీ మామూలు అవుతావు.
నువ్ తప్పక కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ అయితే ఓ నోట్ ద్వారా సమంత కి చిరు ధైర్యం చెప్పారు. మొత్తానికి అయితే సమంత ఆరోగ్యం పట్ల అనేకమంది సినీ ప్రముఖులు అయితే ఈ రకంగా ధైర్యం చెబుతున్నారు.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022