Megastar Chiranjeevi : వైరల్ : ఇన్ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మెగాస్టార్ చిరంజీవి??

Megastar Chiranjeevi : టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద దిక్కుగా ఎంత మంది ఉన్నా కూడా మొదటగా సమస్య వస్తే స్పందించేది మెగాస్టార్ చిరంజీవి అని అందరికీ తెలుసు. సమస్యలు వచ్చినా సహాయం చెయ్యాల్సి వచ్చినా అంతా మెగాస్టార్ ముందుకే వెళతారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ కి మరియు ఏపీ ప్రభుత్వానికి మధ్య మాత్రం పెద్ద రచ్చే నడుస్తుంది. ఇది కూడా అందరికీ తెలుసు.

టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి మారకపోతుండడంతో మెగాస్టార్ పలు సందర్భాల్లో రిక్వెస్ట్ చేసి మాట్లాడినవి ఉన్నాయి అలాగే అసహనం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ ట్వీట్స్ చూస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది. తాజాగా తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ తెలిపారు.

“తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది.” అని టికెట్ ధరలపై కెసిఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ తెలిపారు ఇక్కడితో ఆగకుండా.

“పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి ,మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.” అని చెప్పారు. దీనితో ఇదంతా ఏపీ మంత్రులు ప్రభుత్వం చెయ్యనిది చేస్తున్నారు అనే టైప్ లో పరోక్షముగా విమర్శలు చేసినట్టు చెప్పారు. దీనితో ఇవి వైరల్ అవుతున్నాయి.