Megastar Comments On Taapsee : వైరల్ – ఆన్ స్టేజ్ హీరోయిన్ తాప్సి పై మెగాస్టార్ చిరు హాట్ కామెంట్స్.!

Megastar Comments On Taapsee :  లేటెస్ట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకి థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న మరి చిత్రం “మిషన్ ఇంపాజిబుల్”. భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) హవా కొనసాగుతూనే ఉన్నా వారం వ్యవధిలోనే ఈ చిత్ర బృందం తమ సినిమాని రిలీజ్ కి తీసుకొచ్చేస్తున్నారు. “
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” లాంటి స్పై థ్రిల్లర్ ని టాలీవుడ్ కి అందించిన యంగ్ దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన ఈ మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమానే “మిషన్ ఇంపాజిబుల్”. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో స్టార్ హీరోయిన్ తాప్సి నటించగా ముగ్గురు చిన్నారులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ జరగగా ఈ వేడుకకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం ఆసక్తిగా మారింది. అయితే ఈ స్టేజి పై మాత్రం ఎప్పటిలానే హీరోయిన్ విషయంలో పలు హాట్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.
ఈ సినిమా హీరోయిన్ తాప్సి పై మాట్లాడుతూ నేను పాలిటిక్స్ లో ఉన్నపుడు అనుకుంటా “జుమ్మంది నాదం” సినిమాలో ఈమెని చూసాను. అప్పుడు రాజకీయాల్లో ఉండడం వల్ల ఏమో అప్పుడు ఇలాంటి హీరోయిన్ తో సినిమా చేయలేకపోయానని చిరు ఓ రేంజ్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ మాటలు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.