పూరి జగన్నాద్ కెరీర్ కి ప్రాణం పోసిన మెగాస్టార్..?

లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గర హిట్ అయినటువంటి చిత్రాల్లో దర్శకుడు మోహన రాజా మరియు మెగాస్టార్ చిరంజీవి  నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్”. మరి ఈ చిత్రం అయితే ఈ చిత్రం లో ప్రముఖ దర్శకుడు అయినటివంటి పూరి జగన్నాద్ కూడా ఓ కీలక పాత్రలో అయితే కనిపించారు.

మరి ఇది సినిమాలో మంచి ఆసక్తిగా అప్పుడు మారగా ఈ చిత్రం సక్సెస్ లో భాగంగా అయితే నిన్న రాష్ట్రి మెగాస్టార్ మరియు పూరి జగన్నాద్ ల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ టాక్ సెషన్ జరిగింది. అయితే ఇందులో తమ సినిమా ఎప్పుడు అనేది చర్చకు వచ్చింది.

అయితే ఈ సినిమా కోసం చిరు మాట్లాడుతూ మనం అప్పుడు అనుకున్న ఆటోజానీ సినిమా ఎప్పుడు ఉందా లేక సినిమా స్క్రిప్ట్ చింపేసారా అని అడగ్గా అది పూర్తిగా పక్కన పెట్టేసానని ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ రాస్తానని తాను అయితే తెలిపాడు.

దీనితో నీకోసం అయితే ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయని చిరు హింట్ ఇచ్చారు. దీనితో మాత్రం భారీ డిజాస్టర్ లో ఉన్న పూరి జగన్నాద్ కి తన కెరీర్ లో మెగాస్టార్ ప్రాణం పోసినట్టే అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని అయితే పూరి సరిగా వినియోగిస్తాడా లేదా అనేది చూడాల్సిందే.