Megastar In Sukumar Direction : సుకుమార్ డైరెక్షన్ లో మెగాస్టార్..అతని వర్క్ పై మెగాస్టార్ క్రేజీ కామెంట్స్.!

 Megastar In Sukumar Direction : టాలీవుడ్ లో ఉన్నటువంటి సీనియర్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో క్రియేటివ్ ఫిలిం మేకర్ సుకుమార్ బండ్రెడ్డి కూడా ఒకరని చెప్పాలి. అయితే సుకుమార్ తో పాటు ఆ టైం లో దర్శకత్వం స్టార్ట్ చేసి ఇప్పటికి ఉన్న వారిలో మిగతా అందరు కూడా తమ మార్క్ పక్కన పెట్టేసి ఏవో సుత్తి సినిమాలు చేస్తున్నారు.
కానీ సుకుమార్ ఒక్కడే తన సినిమాల్లో ఎక్కడా కూడా ఏ చిన్న అంశం లో కూడా తన మార్క్ ని మిస్ చెయ్యకుండా వస్తున్నాడు. అందుకే తనతో వర్క్ చెయ్యాలని అందరి హీరోలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక క్రేజీ కాంబో అని చెప్పాలి. అయితే ఇది సినిమా కోసం కాదట.
ఒక యాడ్ షూట్ తో మెగాస్టార్ మరియు సుకుమార్ ల కాంబో సెట్స్ లో కలిసింది. అయితే ఫస్ట్ టైం సుకుమార్ తో పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కొన్ని క్రేజీ కామెంట్స్ అతడి డైరెక్షన్ పై చేశారు. “దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అని తాను తెలిపారు.
దీనితో ఈ క్రేజీ కాంబోపై ఆసక్తి రేగింది. మరి వీరి నుంచి సినిమా కూడా ఏమన్నా పడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే సుకుమార్ “పుష్ప 2” తో బిజీగా ఉండగా మెగాస్టార్ మాత్రం మూడు సినిమాల షూటింగ్స్ మరియు “ఆచార్య” రిలీజ్ తో సిద్ధంగా ఉన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1509756198626951168?s=20&t=UPpc1ZoSnyxG5ZVuLDCpdw