మెగా రివ్యూ : “లాల్ సింగ్ చద్ధా” స్పెషల్ షో తర్వాత చిరంజీవి ఫస్ట్ రివ్యూ.!

టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీటితో పాటుగా ఆల్రెడీ ఓ పాన్ ఇండియా సినిమా కూడా తాను చేశారు. ఇక ఇపుడు అయితే మంచి హిట్ తో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని ఆసక్తిగా తాను ఎదురు చూస్తుండగా..

మరోపక్క బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన తాను కూడా ఓ హిట్ కోసం ఎదురు చూస్తుండగా తాను నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లాల్ సింగ్ చడ్డా” రిలీజ్ కి అందుకోవాలని చూస్తున్నాడు.

మరి అందులో భాగంగా ఈ సినిమాకి ప్రమోషన్స్ ని కూడా అమీర్ ఖాన్ ప్రత్యేకంగా తీసుకోగా మన తెలుగులోనే ముందు స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరు సహా రాజమౌళి సుకుమార్ మరియు నాగ చైతన్య అలాగే నాగార్జున లకు స్పెషల్ ప్రీమియర్ షో ని వేసాడు.

చిరు ఇంట్లోనే ఈ షో అరేంజ్ చెయ్యగా ఇప్పుడు ఇది చూసాక మెగాస్టార్ తన రివ్యూ అందించారు. సినిమా చాలా బాగుంది అని తెలుగులో కూడా ఈ చిత్రం సక్సెస్ అవుతుంది అని బలమైన ఎమోషన్స్ నన్ను మెప్పించాయి ఇదొక వండర్ ఫుల్ ఎమోషనల్ జర్నీ అంటూ తెలిపారు.

మొత్తానికి అయితే మెగాస్టార్ నుంచి ఓ రివ్యూ వచ్చేసింది అంటే ఇక థియేటర్స్ లో ఆల్రెడీ హిట్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి.