Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీకి పెద్దగా నిలిచారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ కూడా ఇవ్వ హీరోలకు పోటీ ఇస్తున్న చిరంజీవి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక చిరంజీవి ఇటీవల కాలంలో ఎక్కడికైనా వెళ్లిన ఏ వేదిక ఎక్కిన సరదా సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తాతయ్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సుమ చిరంజీవితో మాట్లాడుతూ… మీ తాతయ్య గురించి ఏదైనా చెప్పాలి అంటూ అడిగారు. ఈ మాటలకు చిరంజీవి మాట్లాడుతూ .. తరచూ తన అమ్మమ్మ చెప్పే కొన్ని విషయాలను అందరితో పంచుకున్నారు. మా అమ్మమ్మ తరచు మాకు ఒక విషయం చెప్పేది మీకు ఎవరి బుద్ధులు వచ్చినా మీ తాతయ్య బుద్ధులు మాత్రం రాకూడదు అంటూ మా అమ్మమ్మ చెప్పేది.
ఎందుకంటే మా తాత మంచి రసికుడు మాకు ఇద్దరు అమ్మమ్మలు అంటూ ఈయన ఫన్నీగా మాట్లాడారు. అయితే మా తాతయ్య బుద్ధులు పోలికలు మాకు రాలేదు అందుకు ఐయాం వెరీ హ్యాపీ అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాస్ రూటే సపరేటు ఈయన కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.