Megastar Chiranjeevi : వైరల్ : పవన్ కళ్యాణ్ విషయంలో మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.!

Megastar Chiranjeevi : తాజాగా మరోసారి టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు తెలుగు సినిమా వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టికెట్ ధరల అంశంలో అయితే ఏం, నిన్న టాలీవుడ్ పరంగా పెద్దగా ఉండను అని చేసిన కామెంట్స్ అయితేనేం కానీ భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు మరోమారు మెగాస్టార్ పలు సరికొత్త సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి ఈసారి తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ ధరల అంశం లోనే ఆ నాడు నా తమ్ముడు పవన్ టికెట్ రేట్స్ విషయం లో యుద్దం చేసాడు అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడు అనుభవిస్తున్నారని ఊహించని కామెంట్స్ చేశారు. అలాగే కళ్యాణ్ బాబు ఏం మాట్లాడినా న్యాయంగానే మాట్లాడతాడు.

తన స్పందన ఎప్పుడూ కూడా సబబు గానే ఉంటుంది అని తాజాగా నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో తెలిపారు. దీనితో మెగాస్టార్ ఈ సరికొత్త కామెంట్స్ పెద్ద ఎత్తున మళ్లీ వైరల్ అవుతున్నాయి. మరి చిరు ఎందుకు ఇలా ఓపెన్ అవుతున్నారో అనేది తెలియాల్సి ఉంది.