Nagababu: టాలీవుడ్ మెగా బ్రదర్స్ నాగబాబు అలాగే చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. వీరిద్దరిలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది చిరంజీవి అన్న విషయం తెలిసిందే. వందల సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక నాగబాబు సినిమాలను నిర్మిస్తూనే, సినిమాలలో నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఆ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో నాగబాబు మంత్రి అయ్యే అవకాశం ఉంది.
ఇందంతా పక్కన పెడితే నాగబాబు నిర్మాతగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నాగబాబు నిర్మించిన చిత్రాలలో విజయాలు అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఎక్కువ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నాగబాబు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ లతో సినిమాలు నిర్మించారు. అయినా సక్సెస్ కాలేదు. నిర్మాతగా నాగబాబుకు దక్కిన ఒకే ఒక్క హిట్టు బావగారు బాగున్నారా చిత్రం. తాను నిర్మించిన చిత్రాలని నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించారు. చిరంజీవితో రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బావున్నారా, స్టాలిన్ చిత్రాలని నాగబాబు నిర్మించారు. బావగారు బావున్నారా తప్ప మిగిలిన చిత్రాలు ఫ్లాప్ కానీ యావరేజ్ కానీ అయ్యాయి.
పవన్ తో గుడుంబా శంకర్, రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రాలని నిర్మించారు. ఎన్ని ఫ్లాపులు ఎదురైనా తట్టుకోగలిగిన నాగబాబు ఆరెంజ్ మూవీ దెబ్బకి మాత్రం కుదేలైపోయారు. 30 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నాగబాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే నాగబాబు నిర్మాతగా ఫ్లాప్ కావడానికి కారణం ఉందట. చిరంజీవి ఒక సందర్భంలో నాగబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో నాగబాబు నిర్మించిన రుద్రవీణ చిత్రం క్లాసిక్ గా నిలిచింది. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నాగబాబు క్లాసిక్ చిత్రాలని, క్లాస్ టచ్ తో ఉండే కథలని ఎక్కువగా ఇష్టపడతాడు. నాగబాబు స్వభావం అలాంటిది. అందరూ మాస్ చిత్రాలు తీస్తున్నారు కదా, నేను కూడా అదే దారిలో వెళ్ళను అని చెప్పడాట. అందుకే రుద్రవీణ, ఫ్యామిలీ టచ్ ఉన్న బావగారు బావున్నారా, స్టాలిన్ లాంటి చిత్రాలని ఎంచుకున్నారు అని చిరంజీవి తెలిపారు. చిరంజీవి మాటలని బట్టి నాగబాబు తన స్వభావం వల్లే నిర్మాతగా నష్టపోయారు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇలా చిరంజీవి నాగబాబు గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.