మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమాకు అంత తక్కువ పారితోషికం తీసుకున్నారా?

మెగాస్టార్ చిరంజీవికి భాషతో సంబంధం లేకుండా కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. రీఎంట్రీలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్నారనే విమర్శ ఉన్నా చిరంజీవి మాత్రం మార్కెట్ ను, క్రేజ్ ను పెంచే సినిమాలకు ఓటేస్తున్నారు. అయితే చిరంజీవి నటించి విడుదలైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ 1000 రూపాయల కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే ఈ హీరోకు ఇంత తక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని సమాచారం అందుతోంది. అయితే ఆ తర్వాత కాలంలో వరుస సినిమాలలో నటించడంతో పాటు వాటితో విజయాలను అందుకొని చిరంజీవి ఎక్కువ మొత్తం పారితోషికంను సొంతం చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాకు చిరంజీవి ఏకంగా కోటీ 25 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలుగా ఉంది. మరింత ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా చిరంజీవి మాత్రం మార్కెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. చిరంజీవి తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం మాత్రమే తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం.

ఈ విధంగా చేయడం ద్వారా నిర్మాతలపై అదనపు భారం తగ్గుతుందని చెప్పవచ్చు. మెగాస్టార్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతలు సైతం ప్రశంసిస్తున్నారు. చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.