Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో చిరు నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మెగాస్టార్ ఈ సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు.
అన్నీ కుదిర్తే ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్స్ రానున్నాయి ఈ ఆగస్ట్ 22న చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నారు. ఇందులో వశిష్ట సినిమా షూట్ పూర్తైపోయింది. ఈ మధ్యే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తో అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో చిందేసారు చిరు. ఇక ఈ చిత్ర టీజర్ విత్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 22న చెప్పబోతున్నారు. అక్టోబర్ లో విశ్వంభర విడుదల అయ్యేలా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమా షూట్ కూడా వేగంగానే జరుగుతోంది. ఈ చిత్ర టైటిల్ ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నారు. అలాగే ఒక చిన్న డైలాగ్ టీజర్ కూడా రానుందని టాక్. ఈ సినిమాకు మన శివశంకర వర ప్రసాద్ అనే టైటిల్ దాదాపు ఖరారు అయ్యింది. సంక్రాంతికి విడుదల కానుంది ఈ చిత్రం. అలాగే మెగా 158 ప్రకటన బర్త్ డే రోజే రానుంది. అలాగే శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అదేరోజు రానుంది. మొత్తానికి ఈసారి చిరు పుట్టిన రోజంతా సందడే సందడి అన్నమాట. అయితే ప్రస్తుతం మెగాస్టార్ జోష్ తో అభిమానులకు ఫుల్ జోష్ ని నింపనున్నారు.
Chiranjeevi: ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి.. మెగాస్టార్ లైనప్ తెలిస్తే షాకవ్వడం ఖాయం!
